అందరికి నమస్కారం అండి ....మమ్మల్ని గుర్తు పట్టార ....మేము అండి పంచ పాండవులం
మీ చిన్నపుడు దీపావళి కి మీరు మీ చేతులతో మమ్మల్ని తయారు చేసే వారు...మనం చాలా బాగా అడుకునెవారం...
నేను మొదటి వాడిని... శాంత మూర్తిని ...వెలుగు తప్ప చప్పుడు చెయ్యను.... నా పేరు మతబా
నేను రెండవ వాడిని....నా శబ్దం భీముడి గథా దండం లాంటిదే....నా పేరు తాటకు టపకాయ
నేను మూడవ వాడిని... నా వేగం అర్జునుడి బాణం లాంటిది.... నా పేరు పేక జువ్వ
నేను నాలుగో వాడిని... కాంతులను చిరుజల్లు లాగా చిమ్ముతూ ఉంటాను...... నా పేరు చిచ్చుబుడ్డి
నేను ఐదవ వాడిని.... చిన్న వాడిని ...కానీ చాలా హుషారు ఐన వాడినే.... నా పేరు సిసింద్రీ
మా తో పాటు మా బావ శ్రీ కృష్ణుడు సూదర్శనం తిప్పి నట్లు
మీరు తిప్పు తారు కదా... అదే నండి తిపుడు పొట్లం తను కూడా వచ్చింది
ఏదొ సరదాగా మీ అందరిని పలకరించి వెలదామని వచ్చాము
మేము పెద్ద వాలము అయ్యాము ఈ సారి కరోన కదా అందుకని రావటం లేదు....మీరు అందరూ మా next generation తో సంతోషంగా దీపావళి జరుపు కొండి.
అందరికి దీపావళి శుభాకాంక్షలు...💐💐
****మీ ఉషగిరిధర్****

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి