పాము .... ఈపేరు వినిపించిన ...
పాము ... కనిపించిన ... అందరు భయ పడతారు ...
కానీ మన సంస్కృతి లో పాము ని ఒక దేవత గా పూజిస్తాం
మనం రోజు పూజించే దేవతలకి పాము కి మధ్య సన్నిహిత సంబంధం ఉంది
పాము ని మెడలో వేసుకుని శివుడు ... నాగ భూషణుడు అయ్యాడు ,
పాము ని తన తల్ప గా చేసుకుని విష్ణువు..... శేష తల్ప సాయి అయ్యాడు ,
పాము ని యజ్ఞోపవీతగా వేసుకుని వినాయకుడు ..... నాగ యజ్ఞోపవీతను డు అయ్యాడు ,
కుమార స్వామిని నాగ స్వరూపంగా పిలుస్తారు..
అలాంటి పాము ని నాగ దేవత గా ఆరాధించే పండుగ నాగుల చవితి.
నాగుల చవితి రోజు ఆవు పాలు వాల్మీకం లేదా పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు.
నాగుల పేర్లు అనంత, వాసుకి, శేష, పద్మనాబ్, కంబల్, శంఖపాల్, ధ్రుత్రాష్ట్ర, తక్షక మరియు కలియా
**** మీ ఉషగిరిధర్ ***********
బావుంది ఉషా. నాగుల చవితి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండి