Pages

బామ్మ పాట బంగారు పాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బామ్మ పాట బంగారు పాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, మార్చి 2022, సోమవారం

సూర్యని మేలుకొలుపులు


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ


శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ


పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ

పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయ  ||2||   ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||


ఉదయిస్తూ భానుడు ఉల్లీపువ్వు ఛాయ

ఉల్లీపువ్వుమీద ఉగ్రాంపు పొడిఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||



గడియొక్కి భానుడు కంబపువ్వు ఛాయ

కంబపువ్వు మీద కాకారీ పూఛాయ  ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||


జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ

జాజిపువ్వు మీద సంపంగి పూఛాయ  ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||


మధ్యాహ్న భానుడు మల్లేపువ్వు ఛాయ

మల్లేపువ్వు మీద మంకెన్న పూఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||



మూడుజ్జాముల భానుడు ములగపువ్వు ఛాయ

ములగపువ్వు మీద ముత్యంపు పొడిఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||



అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ

ఆవపువ్వు మీద అద్దంపు పొడిఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||



వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ

వంగపువ్వు మీద వజ్రంపు పొడిఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||


గుంకుతూ భానుడు గుమ్మడి పూఛాయ

గుమ్మడీపువ్వు మీద కుంకంపు పొడిఛాయ ||2|| ||శ్రీ సూర్యనారాయణ మేలుకో||


శ్రీ సూర్యనారాయణ మేలుకో

హరిసూర్యనారాయణ


🙏🙏🙏🙏🙏🙏

30, ఆగస్టు 2021, సోమవారం

కృష్ణం కలయ సఖి సుందరం(ముఖారి రాగం - ఆది తాళం )

ఈ  కీర్తన సుప్రసిద్ధ వాగ్గేయకారుడు నారాయణ తీర్ధులు
 రచించిన శ్రీ కృష్ణ లీలా తరంగిణి   అనే భక్తి కావ్యం లోనిది . 
దీనిని భాగవతం లోని దశమ స్కందంలోని ప్రధాన ఘట్టాలను ప్రాతిపదికగా తీసుకొని రచనచేశారు . దీనిలో 12 తరంగాలు, 156 కీర్తన లు ఉన్నాయి. దీనికోసం 36 రాగాలు వాడారు. 

______________________________________________


కృష్ణం కలయ సఖి సుందరం
బాల కృష్ణం కలయ సఖి సుందరం||


కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం|


నృత్యంతమిహ ముహురత్యంతమపరిమిత భృత్యానుకూలం అఖిల సత్యం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |


ధీరం భవజలభారం సకల వేద సారం సమస్తయోగిధారం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |


శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |

 

రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |

దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |

అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం
సదా బాల కృష్ణం కలయ సఖి సుందరం |

 

మా గురువు గారు శ్రీమతి గిరిజా కుమారి గారి గాత్రం లో  ఈ పాట .. 




  



కస్తూరి రంగ రంగా


కస్తూరి రంగరంగా - నాయన్న కావేటిరంగరంగా

శ్రీరంగ రంగరంగా నినుబాసి - యెట్లునే మరచుందురా


కంసుణ్ణి సంహరింపా - సద్గురుడు - అవతారమెత్తెనపుడూ

దేవకీ గర్భముననూ - కృష్ణావ - తారమై జన్మించెనూ

యేడు రాత్రులు చేరిచీ - ఒకరాత్రి - యేకరాత్రిగజేసెను

ఆదివారము పూటనూ - అష్టమీ - దినమందు జన్మించెనూ


తలతోను జన్మమైతె - తనకు బహు - మోసంబు వచ్చుననుచు

ఎదురుకాళ్ళను బుట్టెను - ఏడుగురు - దాదులను చంపెనపుడు

నెత్తురుతొవుండి యపుడూ - ఆబాల - కావుకావున యేడ్చుచు

నన్నేల యెత్తుకొనవే - ఓతల్లి - దేవకీ వందనంబు


ఒళ్లెల హీనంబుతో - ఈరీతి - నున్నాను కన్నతండ్రి

నిన్నెట్లు ఎత్తుకుందూ - నీవొక్క - నిమిషంబు తాళరన్నా

గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల - గంగతా నుప్పొంగెను

గంగనదిలో నప్పుడూ - దేవకీ - జలకంబులాడె నపుడు


ఇకనైన యెత్తుకొనవే - నాతల్లి - దేవకీ వందనంబు

కాని బాలుని వలెను - నన్నిట్లు - యెడబాసి యుండతగునా

నీపుణ్యమాయె కొడుకా - యింకొక్క - నిమిషంబు తాళుమనుచూ

కామధేనువు నప్పుడూ - దేవకీ - కడగి ప్రార్థించగానూ


పాలవర్షము గురిసెను - అప్పుడా - బాలుపై చల్లగానూ

తడివస్త్రములు విడిచెనూ - దేవకి - పొడివస్త్రమును కట్టెను

పొత్తిళ్ళమీద నపుడూ - బాలుండు - చక్కగా పవళించెను

తనరెండు హస్తములతో - దేవకి - తనయుణ్ణి యెత్తుకొనెను


అడ్డాలపై వేసుక - ఆబాలు - నందచందము చూచెను

వసుదేవు పుత్రుడమ్మా - ఈబిడ్డ - వైకుంఠ వాసుడమ్మా

నవనీత చోరుడమ్మా - ఈబిడ్డ - నందగోపాలుడమ్మ

సితపత్రనేత్రుడమ్మా - ఈబిడ్డ - శ్రీరామ చంద్రుడమ్మ


శిరమున చింతామణి - నాతండ్రి - నాలుకను నక్షత్రము

పండ్లను పరుసవేది - భుజమున - శంఖుచక్రములు గలవు

వీపున వింజామరం - నాతండ్రి - బొడ్డున పారిజాతం

అరికాళ్ళ పద్మములును - అన్నియూ - అమరెను కన్నతండ్రీ


నీరూపు నీచక్కనా - ఆ బ్రహ్మ - యెన్నాళ్లు వ్రాసెతండ్రీ

అన్నెకారి కడుపునా - ఓ అయ్య - ఏల జన్మిస్తివయ్య

మా యన్న కంసరాజు - ఇప్పుడూ - వచ్చు వేళాయెరన్నా

నిన్ను నే నెత్తుకోని - ఏత్రోవ - నేగుదుర కన్నతండ్రి


ఆ చక్కదనము జూచి - దేవకి - శోకింపసాగె నపుడు

తల్లి శోకము మాన్పగా - మాధవుడు తంత్ర మొక్కటి చేసెను.

పెద్ద బొబ్బలు పెట్టుచూ, మాధవుడు - గట్టిగా యేడ్వసాగె

శోకంబు చాలించియూ - దేవకి - బాలుణ్ణి యెత్తుకొనెను


నాయన్న వూరుకోరా - నాతండ్రి - గోపాల పవళించరా

అల్లడుగొ బూచివాడు - నాతండ్రి - వస్తాడు పవళించరా

బూచులను మర్దించనూ - నలినాక్షి - బుద్ధిమంతుడను అమ్మా

బూచేమి చేసునమ్మా - నాతల్లి - బూచి నన్నెరుగు నమ్మా


నీ పుణ్యమాయె కొడుకా - నీ వొక్క - నిమిషంబు తాళుమనుచు

అల్లడుగొ జోగివాడూ - నా తండ్రి - వస్తాడు పవళించరా

జోగి మందుల సంచులూ - ఏ వేళ - నా చంక నుండగాను

జోగేమి చేసునమ్మ - నా తల్లి - జోగి నన్నెరుగునమ్మా


నీ పుణ్యమాయె కొడుకా - నీ వొక్క - నిమిషంబు తాళుమనుచు

అల్లదుగొ పాము వచ్చె - నా తండ్రి - గోపాల పవళించరా

పాముల్ల రాజె అయినా - శేషుండు - పాన్పుపై యుండగానూ

పామేమి చేసునమ్మా - నలినాక్షి - భయము నీ కేలనమ్మా


నీలమేఘపు చాయలూ - నీమేను - నీలాల హారములునూ

సద్గురుడు వ్రాసెనాడు - నా తండ్రి - నీరూపు నీచక్కన

నిన్ను నేనెత్తుకోనీ - యేత్రోవ - పోదురా కన్నతండ్రి

నాకేమి భయములేదే - నాతల్లి - నాకేమి కొదువలేదే


మా మామ కంసుకుండు - ఈ వేళ - నన్ను చంపగ వచ్చినా

మా మామ నాచేతనూ - మరణమై - పొయేది నిజము సుమ్మూ

వచ్చు వేళాయెననుచూ - నా తల్లి - వసుదేవు పిలువనంపూ


గోపెమ్మ బిడ్డ నిపుడూ - శీఘ్రముగ - తెచ్చి నీవుంచవమ్మా

అంతలో వసుదేవుడూ - బాలుణ్ణి - తలమీద ఎత్తుకొనెనూ

రేపల్లె వాడలోనూ - గోపెమ్మ - ఇంటనూ వచ్చె నపుడూ

గోపెమ్మ పుత్రినపుడూ - వసుదేవు - భుజముపై నెక్కించుకూ


అతి త్వరితముగ వచ్చెనూ - దేవకి - హస్తముల నుంచె నపుడు

దేవకికి - తనయు డపుడూ - పుట్టెనని - కంసునకు కబురాయెను

ఝల్లుమని గుండెలదర - కంసుండు - పీఠంబు దుమికె నపుడూ

జాతకంబులు చూచెనూ - గండంబు - తగిలెనని కంసుకుండు


చంద్రాయుధము దూసుకా - శీఘ్రముగ - దేవకి వద్దకొచ్చె

తెమ్మని సుతునడిగెనూ - దేవకి - అన్నదీ అన్నతోనూ

మగవాడు కాదురన్నా - ఈ పిల్ల - ఆడపిల్ల నమ్మరా

ఉపవాసములు నోములూ - నోచి యీ - పుత్రికను గంటినన్నా


పుత్రి దానము చేయరా - నాయన్న - పుణ్యవంతుడవురన్నా

దేవాదిదేవులైన - బ్రహ్మ రు - ద్రాదులకు పూజచేసి

పూజ ఫలముచేతనూ - వారి కృప - వల్ల పుత్రికను గంటీ

నీ పుణ్యమాయెరన్నా - నీవు పు - త్రికను దయచేయుమన్నా


నిర్దయాత్మకుడవగుచు - నీవిట్లు - చేయుట తగదు రన్నా

ప్రేమతో చెల్లెలపుడు - అన్నను - చెయిపట్టి బ్రతిమాలెనూ

గంగాది నదులయందూ - పుత్ర దా - నము చేయమని వేడెనూ

కాదుకాదని కంసుడూ - దేవకి - పుత్రికను అడిగె నపుడు


అడ్డాలపై బాలనూ - పుచ్చుకొని - ఎగరేశి నరకబోయె

అంబరమునకు ఎగురగా - వేయనపు - డా బాల కంసు జూచి

నన్నేల చంపెదవురా - నీ యబ్బ - రేపల్లె వాడలోను

పెరుగుతున్నాడు వినరా - కృష్ణావ - తారమై జన్మించెనూ


నిజముగా దోచెనపుడూ - కంసుడు - యేతెంచి పవళించెనూ

రేపల్లె వాడలోనూ - పెరుగుచు - న్నాడనీ దిగులొందెను

నీ యబ్బ నీ తాతరా - కంసుడా - కృష్ణుండు పుట్టెననుచూ

చల్లమ్ము వారలెల్లా - ఆకబురు - చక్కగా చెప్పగాను


పూతకికి కబురాయెను - అప్పుడా - పూతకి చనుదెంచెను

శృంగారముగ పూతకీ - స్తనములకు - విషధార పూసుకొనెను

రేపల్లె వాడలందూ - కృష్ణుడు - తిరుగుచున్నా చోటుకూ

చనుదెంచి విషపుపాలూ - ఇవ్వగా - సమకట్టి ఇవ్వగానూ


బాలురతో బంతులాడ - కృష్ణుని - బాలరందరు కొట్టగా

కావుకావున ఏడ్చుచు - పరుగెత్తి - వీధి నడుమను నిలచెనూ

ప్రేమ కృష్ణుణ్ణి చూచీ - పూతకి - ప్రియముతో బుజ్జగించి

నా యన్న వూరుకోర - నా తండ్రి - పాలు యిచ్చెదను రార


మూడు గుక్కలు పీల్చగా - పూతకి - భూమిపై కొరిగి పడగా

గోపెమ్మ జూచి అపుడూ - బంగారు - గిన్నెలో బువ్వపెట్టి

ప్రొద్దున్న వుగ్గుపోసి - కృష్ణుణ్ణి - ఒడిలోను పండవేసె[1]

అంతలో కంసహితుడూ - బండిరూ - పై - యెదురుగావచ్చెనూ


పాదములు రెండు పిడుగు - లావలే - దడదడా విసిరెనపుడూ

వృషభమై వచ్చి నిలువ - ఒక్కలఘు - వున చంపివేసెనపుడూ

చల్లమ్ము వారలెల్లా - ఈ కబురు - చల్లగా చెప్పిరపుడు

రేపల్లె వాడలోను - ఉన్నట్టి - గోపికలు గుంపుగూడి


మాయిళ్ళ కొచ్చునమ్మా - కృష్ణుడు - మమురవ్వ చేసునమ్మా

తాళలేమమ్మ మేము - నీ సుతుడు - తాలిమితో వుండడమ్మా

ఇకనైన బుద్ధిచెప్పీ - ఇంతిరో - పదిలమ్ము సేయుమమ్మా"

అనుచునూ గట్టిగాను - మనమంత - గోపెమ్మ కడకుబోయి


చెప్పుదామనుచు వారు - గోపెమ్మ - చెంతకేగగ నప్పుడు

గోపాలకృష్ణు డపుడూ - అచటనే - పాలుత్రాగుచు నుండెనూ

ఇదియేమి యాశ్చర్యమే - ఓ చెలియ - ఇదియేమి చోద్యమమ్మ

కనుపాపలను దీసునే - కృష్ణుడు - దొంగతనములు చేసునే


ఇకనేమి చేసునోను - మనము బులు - పాటమున వస్తిమమ్మా

అమ్మనే నెరుగనమ్మా - నాత్రోవ - నేబోవు చుండగాను

ననురవ్వ చేసిరమ్మా - నేనంత - భయపడీ వస్తినమ్మా

కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గొబ్బున పిలువబోవ


కొబ్బరి కుడకలనుచు - గోపికలు - గుబ్బలను చూపినారు

పౌర్ణమి రోజులందు - జలజాక్షు - లందరూ కూడకోనీ

చీరలటు తీసివేసి - గోపికలు - జలకమాడుచు నుండగా

తీసివుంచిన చీరలు - కృష్ణుండు - వేసె ఆ పొన్నమీద


వేసియా వేణునాదం - వూదుచూ - వుండె నా మాధవుండూ

జలకమ్ము చాలించియూ - గోపికలు - మనచీర లేమాయెనే

నమ్మరాదే కృష్ణుని - ఇకను ఈ - చినగొల్లవాని నెపుడూ

ఎంతపని చేసెనమ్మా - ఓ చెలియ - ఏమి యాశ్చర్యమమ్మా


వెదకుచూ కొందరుండీ - నీళ్ళలో - మునిగియుండిరి కొందరూ

అప్పుడూ గోపికలలో - ఒకయింతి - తాజూచి శ్రీకృష్ణునీ

రారె ఓ అమ్మలార - ఈ పొన్న - మీదున్న శ్రీకృష్ణునీ

ఇవ్వరా మా చీరలూ - ఓ కృష్ణ - ఇవ్వరా మా రవికెలూ


దండంబు పెట్టెదమురా - కృష్ణయ్య - దయయుంచి దయచెయ్యరా

అందరూ ఒకచేతితో దండంబు - పెట్టగా చూచితాను

పొందుగా మీరందరూ - దండంబు - రెండుచేతుల బెట్టరే

ఎంతపని వచ్చెననుచూ - గోపికలు - మానభంగము నొందిరీ


వసుదేవ తనయునకునూ - దండంబు - రెండుచేతుల బెట్టిరీ

పొందుగా వలువలన్నీ - కృష్ణుండు - పేరుపేరున ఇచ్చెను

నాయత్త తిట్టునేమో - యనుచు నొక - రొకరితో వగచిరపుడూ

మాయాడు బిడ్డ యిపుడూ - కొట్టునో - నా బావ దండించునో

నా మగడు బ్రతుకనీడు- ఓయమ్మా నీనేమి చేతునమ్మా


కస్తూరి రంగరంగా - నాయన్న కావేటిరంగరంగా

శ్రీరంగ రంగరంగా నినుబాసి - యెట్లునే మరచుందురా



కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏

17, ఆగస్టు 2021, మంగళవారం

శ్రీ కనకవల్లికి సిరుల మా తల్లికిి

శ్రీకనకవల్లికి సిరుల మా తల్లికి సౌభాగ్యవతికిదే జయమంగళం|

చక్కని మోమునకు శ్రీకాంత శోభితకు శ్రీమహాలక్ష్మికి శుభమంగళం||

                                                                 |శ్రీకనకవల్లికి|

ఘల్లు ఘల్లున గజ్జె లందెలు మ్రోగేటి పాదపద్మములకు ఇదే మంగళం|

కనకధారలతోడ గాజుల సవ్వడితో హస్త కమలంబులకు ఇదే మంగళం|

                                                                                      |శ్రీకనకవల్లికి|

కరుణా కటాక్ష వీక్షణంతో చూసేటి అరవిందలోచనకు జయమంగళం|

సకల శుభ కళలతో అలరాలుచున్న మా పద్మనాభ ప్రియకు ఇదె మంగళం|

                                                                                                  |శ్రీకనకవల్లికి|

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకియగు జయ జగజ్జననికిదె మంగళం|

కోరినదే తడవుగా వరములిచ్చే తల్లి హరి పట్టపురాణికిదె మంగళం|

                                                |శ్రీకనకవల్లికి|






30, జులై 2021, శుక్రవారం

నమశివాయలు

                    కాశీలో విశ్వేశ్వర మా జనని అన్నపూర్ణాదేవి తో 

                    కలభైరవ ఈశ్వర జీవులను కరుణించు                    || నమశివాయ||


                  గంగ యమున నడుమను సరస్వతి సంగమ యుండగాను 

                   నాసిక త్రివేణి లో నాణ్యము గా చూడుము                   || నమశివాయ||

 

 జనన మరణములన గా ఈ జన్మలో పుట్టించొచ్చు చందురు 

 మీ నామ పంచాక్షరి స్థిరముగా నిలుపు మీ                   || నమశివాయ||


 కుక్క వలే తిరుగుతూ చాడీలు చక్కగా చెప్పుచుందురు 

 ఒకవేళ ఉన్న బుద్ధి ఒకవేళ ఉండదు                          || నమశివాయ||


 గంతలు  తొమ్మిది ఆలోపల దంతాలు వేయి ఉండును

పంచ క్రోధముల బట్టి నీ యందు పసలేదు                || నమశివాయ||


 మలమూత్రములు గుంటలు ఆ లోపల మాంసపు  నెత్తురు కండలు

 మురికి ప్రేగుల దండతో పైతోలు బహు తీపి                 || నమశివాయ||


 వేదములు చదివిన ఎన్నెన్ని వేషాలు వేసినా

 నీ భక్తి లేని వారు కాశీలో కొరగారు                      || నమశివాయ||


 కామ క్రోధములు లకే మానవులు కాలమంతయు గడుపుచూ 

 మోహజ్వాలములగుచూ  మీకంటే వెలలేదు      || నమశివాయ||


పగలు నాలుగు ఝూములు  పోకిరీలు పోవుచు తిరుగుచుందురు 

 రాత్రి పొద్దు వేళ నా అతి కేలి భోగములు అనుభవిస్తారు 

 ఆమీద కను నిద్రతో మిమ్మలను తలువరు         || నమశివాయ||

 

 పెక్కు మాటలాడుతూ పెద్దలను వింతగా దూషించు 

 సజ్జలు చూచి నవ్వి చప్పట్లు తలువారు                  || నమశివాయ||

 

 ఈశ్వరా నీ నామము యిలలోన ఎవరూ పాడి వినను

 కైవల్యము తో ముక్తి పొందుతారు                      || నమశివాయ||


                                              లోక సమస్త సుఖినో భవంతు

**** మీ ఉషగిరిధర్ *****

27, జులై 2021, మంగళవారం

నవ గ్రహ పాట

1. శ్రీసర్వేశ్వరవర తనయూడు - తేజస్కామూడు |

    సిద్ధి బుద్ధి ­నాయుకుడు - ఆశ్రితవరదూడు |

    గజముఖధరుడూ - గణనాయుకుడు |

    మూషిక వాహన - మోదకహస్తుడు

    శ్రీ అఖండ  గణపతి రక్షించు  ఈ దంపతులనూ ||


2.    హంసవాహనుడు అబ్జాసనుడూ - నారాయుణ సుతుడూ|

       వాణి తలమున వీణా కలిగిన - వాణీ ­ విభుడు |

      వేద జనకుడు వేదాతీతుడు - వేదాంత ­చారపరుడూ |

      బ్రహ్మ దేవుడు రక్షించు  ఈ దంపతులనూ ||


3.   లక్షీసహితుడు నిక్షేపాజ్ఞుడు - పక్షివాహనుడు |

      పాతక సంహారుడు - పీతాంబరధరుడూ |

      అహల్య శాప ­మోచనుండు - అక్షయుమొసగిన ఆది దేవుడు |

    శ్రీమహా­ష్ణువు - రక్షించు ఈ దంపతులనూ ||


4.  పార్వతి సహితుడు - పన్నగధరుడు - ఫాలనేత్రుడు |

    గౌరీహితుడు - గంగాధరుడు - గజచర్మాంబరధరుడూ |

    కరిముఖజనకుడు - గరళగ్రీవుడు - కైలాసాద్రినివాసుండైన |

    సాంబ మూర్తి రక్షించు - ఈ దంపతులనూ ||


5.  రక్తవస్తువు ప్రీతికరుడు - రత్నాంబరధరుడూ |

    రక్తగాత్రుడు - బూగ్వేదుడూ - వేదాచార్యుడు |

    పదిమూడారింట, ఫలదాయుకుడూ - పంచమరాశిన నివసించెడువాడు|

    సూర్యగ్రహము రక్షించు - ఈ దంపతూలనూ ||


6.   తెల్లనిగంధము - తెల్లనిమేను - తేజస్కామూడు |

    రోహిణి హితుడు - రాత్రీశ్వరుడూ - రూఢిగ ఇతడూ |

    ఆరు, ఒకటి, మూడెడింటను ఎప్పటికిని ఫలదాయుకుడైనా |

    చంద్రగ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


7.  అప్రకాశూడు ఆదిత్యోత్తము - డత్యంతోత్తముడు |

     మేషవృశ్చిక రాసుల యుందు కాంక్ష గలవాడు |

    ఆడకధాన్య ఆహారపరుడు - అగ్నిహోత్రునకు అనుకూలుండు |

    అంగారకగ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


8.   సోముని సుతుడు మేషాతీతుడు - మేధాతీతూడూ |

    కన్య ­ధున రాసులయుందు కాంక్ష గలవాడు |

    ఎనిమిది నాలుగు పది రెండింటను - ఎప్పటికిని ఫలదాయుకుడైనా |

    బుధగ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


9.   ధునధనుస్సులాకారముగా - మేదిని లోపలను |

    తొ్మ్మ్దిది రెండెడింటను తొలుతగా ఫల­ుచ్చు |

    బుగ్వేదాత్తుడు - లోకాతీతుడు - ప్రీతిదై్వత ప్రీతి కరుడూ |

    గురుగ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


10.  వృషతుల రాశుల యీరెండింటని - ­వరించెడువాడు |

    భార్గవసుతుడు దానవ హితుడు - ప్రఖ్యాతైనవాడు |

    ఆరు ఒకటి మూడేడింటను - ధనము నొసగెడి - ధవళ శరీరుడు |

    శుక్ర గ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


11.   మంద గమనుడు - మలిన శరీరుడు - మలినాంబరధరుడూ |

    ఆరు - మూడింటను - అనుకూలుండు - ఆయూశ్కారకుదు |

    కుంభమృగాదులు కోరిన విభుడూ -ఛాయూధరడూ ఛాయూ సుతుడు

    శని గ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


12. కృష్ణవర్ణుడు - కృష్ణశరీరుడు - కృష్ణాంబరధరుడూ |

    సృష్టీపరుడూ - నిష్టాపరుడూ - శ్రేష్టుండవు నీవు |

    మాషాశనుడవు - మన్మధ ­మిత్రుడవు |

    మూడారింటను - ముఖ్యుడవైనా |

    రాహుగ్రహము రక్షించు - ఈ దంపతులనూ ||


13. చిత్రవర్ణుడు - చిత్రశరీరుడు - చిత్రాంబరధరుడూ |

    చిత్రాగుప్తాదుల తోటి - మైత్రీగలవాడు |

    త్రిషడస్థానందు శివుడూ వృషళీ పతుడూ కుళుధ్వజుడు |

    కేతుగ్రహము రక్షించు - ఈ  దంపతులనూ ||


14.  ఆశించెవ్వరు నవగ్రహాల - మంగళహారాతీ

    పాడీ ­న్నను - కాశీయూత్రా చేసిన ఫలమూ

    వాసిగ వారణాశి సుబ్బయు్యశాస్త్రి - శాశ్వత వరద నివాసుండైనా

    శ్రీసర్వేశ్వరవర సన్నిధికి - చేరుదు మెల్లపుడూ ||

25, జనవరి 2021, సోమవారం

కృష్టుని మేలు కొలుపులు

 

1. కేశవ యని నిన్ను వాసిగ భక్తులు వర్ణించు చున్నారు మేలుకో,

వాసవ వందిత వసుదేవ నందన  వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


2. నారాయణా నిన్ను - నమ్మిన భక్తుల  కరుణ బ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణ బిరుదు నీకున్నది  శశిధర సన్నుతా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


3. మాధవ యని నిన్ను యాదవులందరు మమత జెందుతున్నారు మేలుకో,

చల్లని చూపుల తెల్లని నామము  నల్లని నాస్వామి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


4. గోవింద యని నిన్ను గోపికలందరు  గొల్లవాడందురు మేలుకో,

గోపీమనోహర గోవర్ధనోద్ధార  గోపాలబాలుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


5. విష్ణు రూపముదాల్చి విభవము దర్శించి విష్ణు స్వరూపుడ మేలుకో,

దుష్టసంహారక దురితము లెడబాపు సృష్టి సంరక్షక మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


6. మధుసూదన నీవు మగువ తోడుత గూడి మరచి నిద్రించేవు మేలుకో,

ఉదయార్క బింబము ఉదయించు వేళాయె వనరుహ లోచన మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


7. త్రివిక్రమా యని శక్రాదులందరు విక్రమ మందురు మేలుకో,

శుక్రాది గ్రహములు సుందరరూపము చూడగోరుచున్నారు మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


8. వామన రూపమున భూదాన మడిగిన పుండరీకాక్షుడా మేలుకో,

బలిని నీ పాదమున బంధన జేసిన కశ్యప నందనా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


9. శ్రీధర గోవింద, రాధా మనోహర యాదవ కులతిలక మేలుకో,

రాధాపధూమణి రాజిల్క నంపింది పొడచూతువుగాని మేలుకో || కృష్ణ తెల్లవారవచ్చేను ||


10. హృషీకేశ యీ భువియందు ఋషులందరు వచ్చి కూర్చొన్నారు మేలుకో,

వచ్చినవారికి వరములు కావలె వైకుంఠ వాసుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


11. పద్మనాభ నీదు పత్ని - భాగాదులు వచ్చి కూర్చున్నారు మేలుకో,

పరమ తారకమైన పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


12. దామోదరా యని దేవతలందరు దర్శించ వచ్చిరి మేలుకో,

భూమి భారము మాన్ప బుధుల బ్రోవను రావె భూకాంత రమణుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


13. సంకర్షణ నీవు శత్రుసంహార మొనర్ప సమయమై యున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావన నామము పాడుచు వచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


14. వాసుదేవా నీకు భూసుర పత్నులు భుజియింప దెచ్చిరి మేలుకో,

భూసురంబుగ యాగసంరక్షణ కొరకు వర్ణింపు చున్నారు మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


15. ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదుడ దుర్జన సంహార మేలుకో,

అబ్జవంశమునందు ఉద్భవించియు కుబ్జ నాదరించిన దేవ మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


16. అనిరుద్ధ యని నిన్ను అబ్జభవాదులు అనుసరింప వచ్చె మేలుకో,

అండజవాహన అబ్ధిసంహరణ దర్భశయన వేగ మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


17. పురుషోత్తమా యని పుణ్యాంగనలంతగ పూజలు జేతురు మేలుకో,

పురుహూతవందిత పురహర మిత్రుడ పూతన సంహార మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


18. అధోక్షజ మిమ్ము స్మరణ జేసినవారి దురితము నెడబాప మేలుకో,

వరుసతోడుత మిమ్ము స్మరణ జేసినవారి వందన మొసగెద మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


19. నారసింహ నిన్ను నమ్మిన భక్తుల కరుణబ్రోతువు వేగ మేలుకో,

శరణన్న రక్షణబిరుదు గల్గిన తండ్రి శశిధరసన్నుతా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


20. అచ్యుతా యని నిన్ను సత్యముగ వ్రతవిధులు కొనియాడవచ్చిరి మేలుకో,

పచ్చని చేలమూ అచ్చంగ దాల్చిన లక్ష్మీమనోహర మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


21. జనార్ధనా నీవు శత్రుసంహార మొనర్చ సమయమైయున్నది మేలుకో,

పంకజాక్షులు నీదు పావననామము పాడుచువచ్చిరి మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


22. ఉపేంద్రా యని నిను సువిదలందరు గూడి యమునతీర మందున్నారు మేలుకో,

గోపీకాంతలు నీదురాక గోరుచున్నారు మురళీనాదవినోద మేలుకో || కృష్ణా  తెల్లవారవచ్చేను||


23. హరి యని నిన్ను కొనియాడ గోపికా జనులంత వచ్చిరి మేలుకో,

అష్టభార్యలు నీదు రాకగోరుచున్నారు వనమాలికాధర మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను||


24. శ్రీకృష్ణా యని నిన్ను గోపాల బాలురు బంతులాడ వచ్చిరి మేలుకో,

కాళీయ మర్ధన కౌస్తుభ మణిహార కంససంహరణా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


25. శ్రీరామ యని మునులు స్థిరభక్తితో మిమ్ము సేవించుచున్నారు మేలుకో,

తాటకీసంహార ఖరదూషణాంతక కాకుత్థ్సకులరామా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


26. తెల్లవారవచ్చె దిక్కులు తెలుపొందె నల్లని నాస్వామి మేలుకో,

వేళాయె గోవులమందకు పోవలె గోపాల బాలుడా మేలుకో || కృష్ణా తెల్లవారవచ్చేను ||


         


హరా కృష్ణ హరా కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే