పండగకి వలస వచ్చిన పిండివంటలు
మరలో బియ్యం పిండి పట్టించి
దుకాణం లో నూనె కట్టించి
నువ్వులు బాగా దట్టించి
నాన్న తో గుండ్రంగా చుట్టించి
అమ్మ ఎర్ర గా వేయించిన జంతికలు....
మినుగులు వేయించి
దుకాణం లో బెల్లం కట్టించి
నెయ్యి బాగా దట్టించి
అమ్మ గుండ్రంగా చేసిన సునుండలు...
బండెక్కి నాతో పాటు వలస వచ్చాయి.
నాలుగు రోజులు నా పంటికింద నలిగాయి....
నాలుగు నెలలు నా కంట్లో మెదిలాయి
పెద్ద డబ్బాలో తియ్యదనం , చిన్న సంచీలో కమ్మదనం
వలస వచ్చిన జ్ఞాపకాలు ఎంతో తీయ్యగా, కమ్మగా ఉన్నాయి..
(పండగ వస్తోంది మీ జ్ఞాపకాలు కూడా పంచుకోండి కింద కామెంట్స్ లో )
లోక సమస్త సుఖినో భవంతు
****** మీ ఉషగిరిధర్ ***********
బాగుంది, కానీ కవితను ఎక్కడ కట్ చేసి ,ఎక్కడ మొదలు పెట్టాలో తెలిస్తే కవితకు ఇంకా అందం వస్తుంది.
రిప్లయితొలగించండిSure I will learn.... Thank you
తొలగించండి