గృహంలో అలక
=============
=============
ఏమిటి అలక గృహం అనకుండా గృహంలో అలక అంటున్నాను అనుకుంటున్నారా..నిజమేనండి....
గత 10 నెలల నుంచి మా గృహంలో అన్ని అలక పూనాయి
లంచ్ బాక్స్ ==== అలిగి అటక ఎక్కింది
ఐరన్ బాక్స్ ==== అలిగి మూల కూర్చుంది
వాచ్ ==== అలిగి తిరగడమే మానేసింది⌚
షూస్ ==== అలిగి దుమ్ము దుప్పటి కప్పుకుని మూల కూర్చున్నాయి.
పెర్ఫ్యూమ్, ఫేస్ క్రీమ్స్ ==== అలిగి ఎక్కడికో వెలిపోయాయి
ఇలా కోన్ని వాడక అలిగితే...
కోన్ని వాడకం ఎక్కువై అలిగాయి...
వాటిలో వాషింగ్ మెషిన్ , సోఫా,టీవీ ...
వంటిల్లు అయితే మరీ అలిగింది బాగా ఎక్కువగా వాడుతున్నాను అని
ఇన్ని అలకల మధ్య నాకు అలక వచ్చినా అలగ లేక పోతున్నాను....😟😟😟
ఈ అలకలు అన్ని ఎప్పటికి తీరే్నో...
ఇది చదివి మీరు అలగ కండి ప్లీజ్ ...😝😝😝
లోక సమస్త సుఖినో భవంతు
******* మీ ఉషగిరిధర్ ***********
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి