కొందరు చూడడానికి వాడతారు
కొందరు చదవడానికి వాడతారు
కొందరు అందానికి వాడతారు
కొందరు తల మీద పెట్టుకుంటే
కొందరు ముక్కు మీద పెట్టుకుంటారు
కొందరు ముక్కు చివర పెట్టుకుంటారు
కొందరు అవసరానికి కొంటే ..
కొందరు హాబీ కొంటారు---- మన ఆంధ్రుల అభిమాన అత్తగారు సూర్యకాంతం గారికి ఈ హాబీ ఉందిట.
సులోచనాలు ఉంటే బాగా తెలివైన వాళ్ళని
బాగా చదువుతారు అని కొందరి అభిప్రాయం.------ అందులో నేను ఒక దానిని
ఆ ఉద్దేశం తోనే చిన్న తనంలో ఒకరోజు మా నాన్నగారిని సులోచనాలు కావాలి అని అడిగాను "రోగం కొని తెచ్చుకోవడం ఏంటి దరిద్రం " అని అక్షతలు వేయించుకోవడం తప్ప సులోచనధారణ భాగ్యం మాత్రం కలగలేదు..
ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం పుణ్యమా అని సులోచనధారణ భాగ్యం కలిగింది.....😎😎😎😎
రెండు రెళ్ళు నాలుగు అంటే మనకున్న రెండు కళ్ళకు రెండు అద్ధాలు జత పడితే నాలుగు కళ్ళు అన్నమాట...ఈ చతురాక్షులంటే నాకు చిన్నప్పటి నుంచి భలే సరదా... మరి మీకు....


Very nice and it's true also
రిప్లయితొలగించండి