పసుపు పులిమిన గడపల పవిత్రత
సన్నాయి గీతాలు తెచ్చిన ప్రశాంతత
రంగవల్లుల తో వచ్చిన రమణీయత
ధూప దీపాల వలన వచ్చిన సుందరత
తోరణాల తో వచ్చిన స్వచ్ఛత తో వెలిగిన మా లోగిలి
పట్టుచీరలు, కొత్తనగల పరిచయాలతో
వంటింట్లో యుద్ధ సరాగలతో
తృప్తినొందిన అతిధుల త్రేన్పులతో
కలలు పండుతాయన్న ఆకాంక్షలతో
అందరి కష్టాలు తీరుతాయన్న ఆశలతో
అందుకు సాక్షిగా పండిన మానోళ్ళతో
మా ఇంట ముగిశాయి సంక్రాంతి సంబరాలు
లోక సమస్త సుఖినో భవంతు
** మీ ఉషగిరిధర్ **
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి