మేము గదిలో ఓ మూల కూర్చుని పాట ప్రాక్టీసు చేసుకుంటున్నా౦ చక్కగా. ....
మగపిల్లలు పురికొసలు కాలవలోకి పట్టుకెళ్లి నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టాలి.
రంగు రంగుల జెండా కాయితాలు కత్తిరించి పురికొస తాడుని బడి బయట ఆ
చివర నుంచి ఈ చివరికి వరసలుగా కట్టి,
ఇంటి దగ్గరనుంచి తెచ్చిన వేడి వేడి ఉడికించిన మైదా తాడుకి పులమాలి.............
జెండా కాగితాలు చిరిగిపోకుండా తాడుకి అతికించాలి
హమ్మయ్య పురికొస అంతా రంగురంగుల జెండా కాగితాలతో నిండిపోయింది..
మిగిలిన జెండాలు గుమ్మాల పైనా, బోర్డు పైనా అతికించేస్తే జెండాల పని అయిపోయినట్టే.
ఈ పైన కట్టే పని మాత్రం పొడుగు పిల్లలదే.
వొచ్చే ఏడాదికైనా వాళ్లంతా పొడుగైపోతే బాగుండును అనిపించేస్తుంది కొందరికి !!!!!!!
అక్కడితో మగ పిల్లల పని ఐపోతుంది
సరే, ఇప్పుడింక మా పని మొదలవుతుంది.
మధ్యాహ్నం బళ్లోకి వచ్ఛేప్పుడే తెల్ల ముగ్గు, రంగు ముగ్గులూ తెచ్చేసుకుంటాం కదా
టీచర్స్ దగ్గరుండి జెండా కర్ర చుట్టూ రంగు ముగ్గు పెట్టించేస్తారు.
ముగ్గులతోనూ, జెండాలతోనూ బడి భలే కొత్తగా అయిపోతుంది కదా.
అప్పుడేమో మేష్టారు,
మర్నాడు పొద్దున్నే జెండాలో వెయ్యడానికి పువ్వులు అవీ ఎవరెవరు తేవాలో చెప్పేసి,
పొద్దున్నే ఉతికిన బట్టలు కట్టుకుని ఆలీసం చెయ్యకుండా బడికొచ్చేయాలని,
ఎవ్వరూ మానకూడదనీ చెప్పేసి ఇంటికి పంపిస్తారు. ఇంటికొచ్చేమంటే
జెండా పండగ సగం అయిపోయినట్టే.
ఇంక మర్నాడు తెల్లారిందంటే ఇంట్లో ఒకటే హడావిడి.
మామూలు పండగల్లాగే తలంటేస్తుంది అమ్మ.
కుంకుడు కాయ రసం కానీ కంట్లో పడిందంటే కళ్ళు ఎర్రగా అయిపోతాయి.
"అబ్బే మా నాన్నగారు అస్సలు
కొట్టలేదు.. కుంకుడ్రసం పడిందంతే"
ఇంక బళ్ళోకెళ్లింది మొదలూ ఎండలో
నిలబెట్టి 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూను. సగం ముగ్గులు చెరిగిపోయి,
మనకి కాళ్ళు నొప్పులు మొదలయ్యాక అప్పుడొస్తారు పెద్దమనుషులు,
జెండా ఎగరెయ్యడానికి. .
ఓ నాలుగు 'ఎటేంషన్' లు' 'స్టెండిటీజ్' లూ అయ్యాక వచ్చే 'ఎటేంషన్' లో పెద్దమనుషులు జెండా కర్ర దగ్గర కొబ్బరి కాయలు కొట్టి,
జెండా ఎగరేసేస్తారు.
మేము పాటలు పాడేస్తా౦.
ఈలోగా మేష్టారు కొబ్బరి చెక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేసి వాళ్ళింట్లో బేసిన్లో
తెచ్చుకున్న పంచదారలో కలిపేస్తారు.
ఇంకో బేసిన్లో చాకలేట్లు, బిస్కట్లు కూడా కవర్లు చింపేసి పోసేస్తారు.
అది మొదలు పెద్ద మనుషులు
గణతంత్ర దినోత్సవ౦ గురంచి చాల చెపుతారు ..
హమ్మయ్య! చిన్న
చిన్న కాగితం ముక్కల్లో కొబ్బరి ముక్కలూ అవీ ఇచ్చేస్తారు.... ఎప్పటిలాగే మేష్టారు గారు
"పడెయ్యకూడదు.. గాంధీ గారి ప్రసాదం" అని చెప్పి
అక్కడితో జెండా పండగ ముగిసింది
గణతంత్ర దినోత్సవ౦ శుభాకాంక్షలు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి