Pages

25, మార్చి 2021, గురువారం

పార్వతీశం ప్రయాణం (2021)-- 1


పార్వతీశం ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు ఏమో ...

అదే అండి మన నరసింహశాస్త్రి  గారి పార్వతీశం... 

మన వాడు .. మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తి .. 

వచ్చి  80 సంవత్సరాలు దాటినా మన తెలుగు వారి మనసులో ఉన్న వ్యక్తి ..


నాకు ఒక ఆలోచన వచ్చిందీ ..

ఒక సారి చదువు కోసం ఇంగ్లాండు వెళ్లి వచ్చిన పార్వతీశం ... 

ఇప్పటి రోజులలో మళ్లీ ప్రయాణం కడితే ఎలా ఉంటుందా అని?

ఇంకెందుకూ అల్లస్సం చదవండి ... 

                              ************

"మొగలితుర్రు కాపురస్థుడు  అయిన  వేమూరు పార్వతీశం చాల సంవత్సరాల తరవాత మళ్లి ఒక సారి ఇంగ్లాండు వెళ్లి వద్దాము అని ఆలోచన వచ్చింది .. "

ఈ సారి  ఇంట్లో వాళ్ళకి చెప్పి ప్రయాణం మొదలు పెడతాడు ....


ఒక సారి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది కాబట్టి .. 

ఇంతక ముందు చేసిన తప్పులు ఏమీ మళ్లి జరగ కుండా చూసుకోవాలి అని అనుకుని 

ఫ్లైట్ టికెట్స్ అవి  కొనుక్కుని .. 

కావలిసి సామానులు లిస్ట్ ఒకటి సిద్ధం చేసుకుంటాడు!

సామానులు కొనడానికి బజారుకి వెళతాడు ..

ముందుగా .. 

దంత దావనానికి  .. బ్రెష్ , పేస్ట్ . 

స్నానం కి .. సబ్బులు , ఒక టవల్ 

ఒక నాలుగు జతల బట్టలు .. 

కరోనా సమయం కదా .. మల్లి అక్కడ మాస్క్ లు కొనడం ఎందుకు అని 

ఒక నాలుగు నారింజ పండు రంగు మాస్క్ లు ... 

దువ్వెన కొందాం అని అనుకుని ... 

దాని అవసరం పెద్దగా లేదు అని విరమించుకున్నారు .

( వయసు పై బడింది కదా బట్ట తల వచ్చిందీ ) 

కరోనా సమయం లో అక్కడ భోజనం ఇబ్బంది అవుతుందేమో అని 

ఒక ప్రియా ఆవకాయ ,
 MTR సాంబారు పొడి కొనుకుని . 

దూర ప్రయాణం కదా సెల్ ఛార్జింగ్ ఐపోయిన ఉంటుంది అని ఒక పవర్ బ్యాంకు కొనుకుంటారు  .

ఇంకా ఏమీ ఐనా కావాలి అంటే అమెజాన్ లో ఆర్డర్ చేయచ్చు అని ఇంటికి చేరుకుంటారు  .

ఇంటికి వచ్చి మడత కుర్చీ లో కూర్చుని ఉండగా ... ఒక అనుమానం వచ్చింది.....


                                

                                                                         ( ఇంకా ఉంది)

                          **** మీ ఉషగిరిధర్ ****

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి