Pages

15, ఫిబ్రవరి 2021, సోమవారం

పుస్తక విలాపం


జూన్ లో అట్టలు వేసి , పసుపుతో ఓం రాసి చక్కగా సింగారించి ఎంతో  జాగ్రత్తగా చూసుకుంటారు .. 

మొదటిలో ముత్యాల కోవ లాంటి రాత .. 

నవంబర్ వచ్చేసరికి   అట్టలు  చిరిగి పోయి .. అర్ధం కాని బ్రహ్మ రాత... 

మొదట పేజీలు అన్ని పాఠాలు .. 

చివరి పేజీలు అన్ని చుక్కల ముగ్గులు ... 

మధ్య పేజీలు అన్ని దానాలు .. 

మార్చి  వచ్చేసరికి   ... మీ రాత మీకే అర్ధం కాకా నన్ను తిట్టుకోవడం .. 

సంవత్సరం చివర గుప్పెడు బఠానీలతో  ముగింపు ... 

జూన్ లో భీముడి లా  ఉన్న నేను .. 

మార్చి కి కరువు ప్రాంతం నుంచి వచ్చిన దానిలా అయ్యిపోయాను ....





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి