***********************************************
కాలం మారవచ్చు..
కలలు మారవచ్చు ..
మన అనుకున్న వాళ్లు మారవచ్చు...
కానీ మనం ఎప్పటికి మరువలేని మార్పు జ్ఞాపకం...
అలాంటి జ్ఞాపకం ప్రతి మనిషికి ఒక వరం,
ఒక ఆనందం, ఒక అనుభవం..........
ఒక మిత్రుడు ,ఒక శత్రువు,
ఒక అద్భుతం ,ఒక ప్రయాణం....
ఇలా జ్ఞాపకాలు మనకి ఎన్నో గుర్తు చేస్తూ ఉంటాయి...
మరి అలాంటి కొన్ని జ్ఞాపకాలు మనకి ఆనందాన్ని ఇచ్చి,
మళ్ళీ మన చిన్న నాటికి తీసుకెళ్లే వాటిని గుర్తు చేస్తూఉంటాయి ...
చిన్ననాటి జ్ఞాపకాలు అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేవి మనం ఆడిన ఆటలు, వాటికి అయిన గాయాలు.
నాలుగు స్తంభాలాట, ఏడుపెంకులాట, దాగుడు మూతలు,
దొంగ పోలీస్ ,వైకుంఠపాళి ఇలా అనేకమైన ఆటలు...అమ్మమ్మ నానమ్మల ఏడు రాజుల కథలు..
వీటిని గుర్తు చేసుకోగానే అలా ప్రతి ఒక్కరి పెదవిపై ఒక చిరునవ్వు ,
అణువు ..అణువులో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది.
ఇలా మన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, వాటినుంచి నేర్చుకుంటూ
అందరికి పంచుకుంటూ ...ఆనందంగా ముందుకు సాగుదాం.
“బేంక్ లో నిలవ ఉన్న డబ్బు లా చిన్న నాటి జ్ఞాపకాలు !!!! ”
కళ్ళముందు ఆనందం కరిగిపోయినప్పుడల్లా ..
ఓ చెక్కు రాసి బాల్యం ఖాతా లోంచి ..
తీయనైన జ్ఞాపకాలు సొమ్ము చేసుకుని వెల్లివిరిసిన ఉత్సాహం తో ..
నిరాశను తరిమి కొట్టి..పరిస్థితులను ఎదుర్కొంధాం .
లోక సమస్త సుఖినో భవంతు
**** మీ ఉషగిరిధర్ ****
చక్కగా రాసారు, మీ కధతో మా బాల్యాం లోకి తేసుకెల్లారు.
రిప్లయితొలగించండి