గీత అను రెండు అక్షరాలను అర్థం చేసుకోవడానికి రెండు యుగాలు పడుతుంది
సీతమ్మ తల్లి గీత దాటడం వల్ల రామరావణ యుద్ధం జరిగింది....
శ్రీకృష్ణపరమాత్ముడు గీత బోధించడం వల్ల కురుక్షేత్ర సంగ్రామం ముందుకు నడిచింది...
ఒక పండితుని గీత గురించి అడిగితే ......భగవద్గీత గురించి చెప్తారు
ఒక మాస్టర్ ని గీత గురించి అడిగితే . .......లెక్కల్లో గీత గురించి చెప్పారు
ఒక జ్యోతిష్యుని గీత గురించి అడిగితే .........చేతిలో గీతలు గురించి చెప్పారు
ఎవరు ఎలా చెప్పినా మనిషి తలరాతను మార్చే శక్తి గీత కు ఉంది
కొందరికి గీత ఒక పుస్తకం
కొందరికి గీత ఒక నమ్మకం
కొందరికి గీతే దైవం
కొందరికి గీత ఒక పరిశోధనా గ్రంథం
కొందరి ప్రశ్నలకు సమాధానం గీత
కొందరి సమస్యలకు పరిష్కారం గీత
గీత .....మనలో ధైర్యం నింపుతుంది
గీత ..... మనలో అహంకారం తగ్గిస్తుంది
అందరూ భగవద్గీత చదవండి.... చదివించండి
లోకా సమస్తా సుఖినోభవంతు
*****మీ ఉషగిరిధర్***

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి