చిన్ననాటి పడవ ప్రయాణం
పడవ ప్రయాణం అంటే అందరూ కేరళ... గురించి చెప్తారు
కాని మా గోదావరి జిల్లాలో పడవ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుందండి.
నా చిన్నతనంలో నేను చేసిన ఒక పడవ ప్రయాణం గురించి మీతో పంచుకుంటున్నాను.
నాకు బాగా గుర్తు అది సంక్రాంతి పండగకు ముందు. ఇంటి నిండా చుట్టాలున్నారు అమ్మ నన్ను పిలిచి రేపు ఉదయం మనంఊరు వెళ్ళాలి అని చెప్పింది.( ఊరంటే ఏ అమెరికాలో అనుకునేరు అప్పనపల్లి మా ఇంటికి చాలా దగ్గర లేండి) పొద్దున్నే లేచి పిల్లలందరూ చాలా ఉత్సాహంగా రెడీ అయ్యి వీధిలోకి వచ్చా.
నాన్న గుర్రబ్బండి ని పిలిచారు (ఆ రోజుల్లో ఆటోలు లేవు లెండి) నేను ఎంతో ఉత్సాహంతో చివరికి కూర్చున్నాను .అన్ని చూడొచ్చని ,అమ్మ చిన్న పిల్లవి పడిపోతావ్ అని నన్ను లోపలికి గెంటేసింది.
గుర్రబ్బండి నడుపుతున్న ఆ తాత పక్కన కూర్చుని నా సందేహాలు అడగడం మొదలు పెట్టాను
గుర్రానికి కళ్ళు మూసి ఉన్నాయి కదా మరి ముందు ఎలా కనిపిస్తుంది.
గుర్రం మెల్లో ఆ రంగు రంగుల తాళ్లు ఎందుకు కట్టారు .........
అమ్మ నా ప్రశ్నలన్నీ విని... నువ్వు కొంచెం సేపు నీ ప్రశ్నలు ఆపుతావా అంది కోపంగా.
ఇంతలో రేవు వచ్చింది ... అందరూ నెమ్మదిగా గుర్రబ్బండి దిగి
తప్పిపోకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకుని లాంచీ టికెట్ల అమ్మే దగ్గరికి వెళ్ళాము. నాన్న అందరికీ లాంచీ టిక్కెట్లు తీసుకున్నారు.( టిక్కెట్లు అంటే వందలు ఉంటాయి అనుకునేరు ఐదు రూపాయలు ఉండేవి) లాంచీ రెడీగా ఉంది వెళ్ళమని చెప్పాడు ఆ టికెట్లు ఇచ్చే వ్యక్తి.
ఈ లోపు నేను నాన్నని రంగు సోడా కావాలి అని అడిగాను . పోనీ అని పిల్లలందరికీ నాన్న సోడా కొనిపెట్టింది. అందరు తాగడం అయిపోయింది కానీ నాది ఇంకా అవలేదు ఈలోపల లాంచీ వెళ్ళిపోయింది .నాన్న నా కేసి చాలా కోపంగా చూశారు .
నేను అమ్మ వెనకాల నుంచుని నా సోడా తాగడం పూర్తి చేశాను నెమ్మదిగా....
నాన్న వెళ్లి ఆ టికెట్లు ఇచ్చిన వ్యక్తిని అడిగారు
మళ్ళీ ఇంకో లాంచీ ఎప్పుడు వస్తుంది అని
ఒక అరగంటలో వస్తుంది కూర్చోమని చెప్పాడు.
నేను కూర్చుని ఇంటి నుండి తెచ్చుకున్న జంతికలు తినడం మొదలు పెట్టాను. ఈలోపు లాంచీ వచ్చింది తొందరగా వెళ్ళమని చెప్పాడు టిక్కెట్లు ఇచ్చే వ్యక్తి. అందరం వెళ్లి లాంచీ ఎక్కి కూర్చున్నాము.పైకి ఎంతో సంతోషంగా ఉన్నా లోపల ఎందుకో కొంచెం భయంగా ఉంది.
లాంచీ బయల్దేరింది నది మధ్యలో వెళ్ళేసరికి అమ్మ నా చేతికి డబ్బులు ఇచ్చి దండం పెట్టుకుని నదిలో వేయమంది. ఎందుకు అని అడిగాను నేను? ప్రశ్నలు అడక్కుండా చెప్పిన పని చెయ్యి అని చెప్పింది అమ్మ.
నాన్న దగ్గరకు పిలిచి ఇలా చెప్పారు పూర్వకాలంలో డబ్బులు రాగితో చేసేవారు ... రాగి కి నీటిని శుద్ధి చేసే గుణం ఉంది. అందుకని రాగి డబ్బులు నీళ్లల్లో వేసేవారు. ఇప్పుడు డబ్బుల్ని స్టీల్ తోనూ ఇనుముతో చేస్తున్నారు అయినా పాత పద్ధతి మారలేదు అని ఒక నవ్వు నవ్వారు.
లాంచి వడ్డుకు చేరింది...మళ్ళీ గుర్రబ్బండి ఎక్కి వెంకన్న గుడికి చేరుకున్నాము..దేవుడు మీద భక్తి... ప్రసాదం మీద భుక్తి ఉన్న వాల్లం కాబట్టి... ఆ రెండు ముగించుకొని... ఆ ఊరు లోనే ఉన్న మా మేనత్త గారి ఇంటికి వెళ్లి బోజనాలు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణ అయ్యాము.
ఇది చదివి మీరు ఇప్పుడు ఇలా ప్రయాణం చేదం అనుకునేరు ....
గురంబండి పోయి ఆటో వచ్చి డాం డాం డాం
లాంచీ పోయి బ్రిడ్జ్ వచ్చి డాం డాం డాం
సోడా పోయి కూల్ డ్రింక్ వచ్చి డాం డాం డాం
కానీ మా అప్పనపల్లి వెంకటేస్వర స్వామి గుడి కి మాత్రం వెలండి
లోకా సమస్తా సుఖినోభవంతు
ఓం నమో వెంకటేశాయ
************మీ ఉషగిరిధర్********





Unforgettable days
రిప్లయితొలగించండి