కాశీలో విశ్వేశ్వర మా జనని అన్నపూర్ణాదేవి తో
కలభైరవ ఈశ్వర జీవులను కరుణించు || నమశివాయ||
గంగ యమున నడుమను సరస్వతి సంగమ యుండగాను
నాసిక త్రివేణి లో నాణ్యము గా చూడుము || నమశివాయ||
జనన మరణములన గా ఈ జన్మలో పుట్టించొచ్చు చందురు
మీ నామ పంచాక్షరి స్థిరముగా నిలుపు మీ || నమశివాయ||
కుక్క వలే తిరుగుతూ చాడీలు చక్కగా చెప్పుచుందురు
ఒకవేళ ఉన్న బుద్ధి ఒకవేళ ఉండదు || నమశివాయ||
గంతలు తొమ్మిది ఆలోపల దంతాలు వేయి ఉండును
పంచ క్రోధముల బట్టి నీ యందు పసలేదు || నమశివాయ||
మలమూత్రములు గుంటలు ఆ లోపల మాంసపు నెత్తురు కండలు
మురికి ప్రేగుల దండతో పైతోలు బహు తీపి || నమశివాయ||
వేదములు చదివిన ఎన్నెన్ని వేషాలు వేసినా
నీ భక్తి లేని వారు కాశీలో కొరగారు || నమశివాయ||
కామ క్రోధములు లకే మానవులు కాలమంతయు గడుపుచూ
మోహజ్వాలములగుచూ మీకంటే వెలలేదు || నమశివాయ||
పగలు నాలుగు ఝూములు పోకిరీలు పోవుచు తిరుగుచుందురు
రాత్రి పొద్దు వేళ నా అతి కేలి భోగములు అనుభవిస్తారు
ఆమీద కను నిద్రతో మిమ్మలను తలువరు || నమశివాయ||
పెక్కు మాటలాడుతూ పెద్దలను వింతగా దూషించు
సజ్జలు చూచి నవ్వి చప్పట్లు తలువారు || నమశివాయ||
ఈశ్వరా నీ నామము యిలలోన ఎవరూ పాడి వినను
కైవల్యము తో ముక్తి పొందుతారు || నమశివాయ||
లోక సమస్త సుఖినో భవంతు
**** మీ ఉషగిరిధర్ *****
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి