శ్రీకనకవల్లికి సిరుల మా తల్లికి సౌభాగ్యవతికిదే జయమంగళం|
చక్కని మోమునకు శ్రీకాంత శోభితకు శ్రీమహాలక్ష్మికి శుభమంగళం||
|శ్రీకనకవల్లికి|
ఘల్లు ఘల్లున గజ్జె లందెలు మ్రోగేటి పాదపద్మములకు ఇదే మంగళం|
కనకధారలతోడ గాజుల సవ్వడితో హస్త కమలంబులకు ఇదే మంగళం|
|శ్రీకనకవల్లికి|
కరుణా కటాక్ష వీక్షణంతో చూసేటి అరవిందలోచనకు జయమంగళం|
సకల శుభ కళలతో అలరాలుచున్న మా పద్మనాభ ప్రియకు ఇదె మంగళం|
|శ్రీకనకవల్లికి|
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకియగు జయ జగజ్జననికిదె మంగళం|
కోరినదే తడవుగా వరములిచ్చే తల్లి హరి పట్టపురాణికిదె మంగళం|
|శ్రీకనకవల్లికి|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి