చందమామ చందమామ ఓ చందమామా
చందమామ చందమామ ఓ చందమామా
చందమామ కూతుళ్ళు నీలగిరి కన్యలు
నీలగిరి కన్యలకు నిత్యమల్లె తోట
నిత్యమల్లె తోటలో నిర్మల్ల బావి
నిర్మల్ల బావికి గిలకల్ల తాడు
గిలకల్ల తాడుకి బుడికి బుడికి చెంబు
బుడికి బుడికి చెంబంటే అందరికి మనస్సు
బుడికి బుడికి చెంబుకి పేడ ముద్ద దిష్టి
పేడ ముద్ద దిష్టికి పప్పు బెల్లం నైవేద్యం
ఉషా, నీకు ఇవి అన్నీ ఎంత బాగా జ్ఞాపకం ఉన్నాయో. ఇవన్నీ విని నాకు చాలా సంవత్సరాలయింది. అన్నీ చదివితే ఆరోజులు గుర్తుకువచ్చాయి. నన్ను గత జ్ఞాపకాలలోకి తీసుకు వెళ్ళిన నీకు కృతజ్ఞతలు. వీలు చూసుకుని వీటి వీడియోలు, పాటలు పాడుతున్న పిల్లల ఫోటోలు నీ బ్లాగులో పోస్ట్ చెయ్యి. గొబ్బిళ్ళు ఆడుతున్న నీ పిల్లల ఫోటోలు ఇక్కడ పోస్ట్ చెయ్యచ్చునుగా.
రిప్లయితొలగించండి