ఏమిటో.. ఏమీ తోచకుండా ఉంది.
అలా అని పని లేకుండా లేదు. ఉంటూనే ఉంది.. అయినా తోచీతోచకుండా ఉంది.
ఏ తోడికోడలు పుట్టింటికన్నా వెళ్దామంటే ఎవరూ లేరు మరి.
'తోచీతోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది' అని కదా సామెత.
మరి తోచీ తోచనమ్మ చేయాల్సింది ఇదే కదా.
చదవాల్సిన పుస్తకాలు 'మా సంగతేమిటి?' అని ప్రశ్నిస్తున్నాయ్.
ఉన్నవి చాలనట్టు మొన్ననే ఓ చిన్న పుస్తక ప్రదర్శనకి వెళ్లి ఓ నాలుగు కొత్తవి తెచ్చా. లాభం లేదు, కొంచం స్పీడు పెంచాలి, చదివే విషయంలో.
"3రెడ్ వేవ్ వస్తుందా మళ్ళి లాక్ డౌన్ ఉంటుందా ?" ఉదయాన్నే ఫోన్ పలకరింపు.
కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్తే వినబడ్డ వ్యాఖ్యానాలు నవ్వు తెప్పించాయ్.
"ప్రభుత్వం మారినా కూరల రేట్లు తగ్గలేదు.." అనుకుంటున్నారు జనం.
"సొరాజ్జం వస్తే మా ఊరి కానిస్టీబుకి బదిలీ అవుతుందా బాబయ్యా" అంటూ 'కన్యాశుల్కం' లో బండి వాడి ప్రశ్న గుర్తొచ్చేసింది.
ఎవరి సమస్యలు వాళ్ళవి మరి.
ఎన్నో పనులల్లో బిజీ గా ఉన్న ముఖ్యమంత్రికి కూరల రేట్లు లాంటి చిన్న విషయాలు పట్టించుకునే తీరిక ఉంటుందా? వీళ్ళ పిచ్చి కానీ.
థియేటర్ కి వెళ్లి సినిమా చూసి చాలా రోజులయ్యింది. చూడాలనిపించే సినిమా ఏదీ కనిపించడం లేదు.
నా టేస్ట్ లో ఏదో లోపం ఉందేమో మరి. కనీసం నిర్మాణం లో ఉన్న సినిమాలు కూడా ఏవీ చూడాలనే కుతూహలాన్ని కలిగించడం లేదు.
కాలం అంతా ఒటిటిలతోనే కాలక్షేపం చేయాల్సి వచ్చేలా ఉంది.
ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను కదా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి