అసలు అందరూ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు 'ఉగాది' జరుపుకుంటారు కానీ,
మా ఊరికి ఉగాది కళ ఓ రెండు రోజుల ముందు మొదలవుతుంది ..
పంచాంగ శ్రవణం కోసం మా ఊరి రామాలయం పందిరితో రెడీ చేయడం..
పానకాలకి ఇత్తడి గుండిగ శుబ్బరంగా తోమి , స్టీల్ గ్లాసులు రెడీ చేయడం ...
ఇలా ఎన్ని పనులో
పిల్లలు అంటారుకాని ఎన్ని పనులు ఉండేవో ....
ఉగాది రోజు పోద్దినే కొత్త బట్టలతో రెడీ ఐపోయి ..
అమ్మ చేసిన ఉగాది పచ్చడి తినేసి ..
చదవడం పెద్దగా రాని వయసు ఐనా ..
కొత్త పంచాంగం తీసి
ఆదాయ ..వ్వయం
రాజపూధ్యం .. అవమానం .....చూసుకుని
కొంచం సేపు పిల్లలు అందరం కూర్చుని జాతకాల మీద చేర్చించుకొ౦టుండగా
అమ్మ భోజనానికి పిలిచేసేది
అమ్మ చేసిన పిండివంటలు సంగతు చూసి..
ఇంక గుడిక బయలుదేరడం ..
మా ఊరులో సుబ్బారావుగారు అని ఒక మాస్టారు ఉండేవారు ..
ప్రతి ఉగాదికి పంచాంగ శ్రవణం అయన చదివేవారు ..
పిల్లలు అందరం ముందు వరసలో కుర్చునేవారం ..
బాగా వినిపిస్తుందిఅని ..
మా గుడికి అప్పుడు స్పీకర్ , మైక్ లేదు లెండి ...
కొత్త సవత్సరం లో జరిగే
మంచి .. చెడు
వ్యవసాయం .. వ్యాపారం
పాడి .. పంట
వానలు .. ఎండలు
అన్ని చెప్పేవారు ..
కానీ ఎప్పుడు మా పరీక్షలు .. మార్కులు గురంచి చెప్పలేదు
మా రాశి ఐపోగానే మేము అక్కడినుంచి ..
బెల్లం దంచే సావిడికి వెళ్లిపోయేవాళ్ళం ..
వచ్చిన ముక్షమైన పని ఆదికదా ..
పెద్ద వాళ్ళు ఒకళ్లు ..
ఒక ఇత్తడి చెంబులో దేవుడికి పానకం, శనగలు తీసుకుని గురువు గారికి ఇచ్చేవారు ..
మా గోదారిరాముడికి నైవేద్యం పెట్టాక ..
ముందు పిల్లలకి తరవాత పెద్దలకి .. శనగలు .. పానకం
ఇక్కడ ఒక రూల్ ఉంది .. పానకం తాగక గ్లాస్ కడిగి నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలి ..
ఇప్పటిలా ప్లాస్టిక్ గ్లాసులు కాదు ...
మా ఊరి వాళ్ళకి ప్రకృతి మీద ప్రేమ ఎక్కువ అందుకని స్టీల్ గ్లాసులు వాడే వాళ్ళు ..
ఉగాదికి ఊరు వెళ్లి చాల సంవత్సరాలు గడిచింది .. కానీ అక్కడ పద్ధతులు ఏమి మారలేదు ..
అందరికి ఉగాది శుబాకాంక్షలు
*********ఉషగిరిధర్ ********

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిSubbarao Garu Panchanga sravanam and Bellam Panakam..fond memories.
రిప్లయితొలగించండి😊 Happy Ugadi
రిప్లయితొలగించండి😊 Happy Ugadi
రిప్లయితొలగించండి