**************************
ఊరంతా తాటాకు పందిర్లు.. మామిడాకు తోరణాలు ..
ప్రతి ఇంట్లో చుట్టాలు .. అందరూ పెళ్ళివారే ..
సీత రాముల కళ్యాణం కదూ ... అందుకని
మా ఊరి రామాలయం చూడటానికి చిన్నది ఐనా పక్కనే కౌశిక ..
కంటికి కనిపించే అంత మేర కొబ్బరి తోట .. చూడటానికి రెండు కళ్ళు చాలవు .
మా ఊరి లో శ్రీ రామ నవమి హడావిడి రెండు రోజుల ముందు మొదలవుతుంది .
పెద్ద వాళ్ళు ...పందిర్లు.. తోరణాలు గురంచి చూసుకుంటే ..
పిల్లలు .. గుడిని రంగు రంగుల కాగితాలతో అలంకరించడం..
ఇత్తడి పల్లకి , కంచు గంట , పల్లాలు,కాగడాలు , కోల తోమడం .. ..ఇలా ఎన్ని పనులో
ఆడ పిల్లలు అందరం చింత పండు , ఉప్పు తో తోమడం ..
మగ పిల్లలు నూతిలో నీళ్లు తోడటం అనమయతి గా వస్తోంది
ఒకరోజు ముందే అందరం సుబ్బరంగా పల్లకి, గంట, పల్లాలు అన్ని తోమేసి మండువాలో పేట్టేసే వాళ్ళం ..
మా రాముడి పల్లకి(ఇత్తడిది ) చాల బరువు ..
ప్రతి సవత్సరం కావలసిన వస్తువులు ఐనా ..
గురువు గారు ఒక రోజు ముందు లిస్ట్ రాసి నాన్న కి ఇచ్చేవారు
అది ఒక ఆనందం .. పసుపు , కుంకుమ తో ఆ లిస్ట్ మొదలు ..
శ్రీ రామ నవమి రోజు తొందరగా పట్టు బట్టలు కట్టుకుని రెడీ ఐపోయేవాళ్ళం
పెళ్లివారం కదూ ...
మేము ఆడ పెళ్లి వారం అందుకని అమ్మ ..
తలంబ్రాలు , జీలకర్ర బెల్లం , సీత రాములకి పట్టు బట్టలు ..
గుమ్మడి పండు , అరటి పళ్ళ అత్తమ్ , గంధపు చక్క ,ఉత్తర ధన్యాలు
పూలు పళ్ళు అన్ని ఇత్తడి పల్లాలలో సద్ది రెడీగా ఉంచేది
లిస్ట్ ప్రకారం అన్ని వచ్చాయా లేదో చెక్ చేయడం నా పని ..
భాజాలు చప్పుడు వినిపించగానే ఏదో తెలియని సంతోషం .
కళ్యణనికి ముందు ఊరేగింపు ఉంటుంది ...
కాగడాలు పట్టుకోవడానికి పిల్లల పోట్లాటలు
మొత్తానికి తలా కాసేపు అని ఒప్పందం జరిగేది .
పల్లకి గుడికి చేరగానే గుడి చుట్టూ మూడు ప్రదక్షణలు చేసి
రాముని కళ్యణ పీఠం మీద కూర్చో పెడతారు ..
ఆడ వాళ్ళు ఒక వైపు .. మగ వాళ్ళు ఒక వైపు కింద కుర్చునేవాళ్ళు ..
కింద కూర్చోలేని వాళ్ళకి వెనకాల కుర్చీలు
మా గుడి లో రాముని కళ్యాణానికి ఒక అనామయాత ఉంది ..
కళ్యాణం జరిగిన అంత సెపు కర్పూరం హారతి వెలుగుతూ ఉండాలి ..
మా ఊరిలో రాముడు గారు అని ఒక తాత గారు ఉండేవారు
పిల్లల అందరిచేత కొంచం , కొంచం కర్పూరం వేయించేవారు ..
అది వేసినంత సెపు రామ నామం చెప్పాలి అది రూల్ ..
ఈలోగా గురువు గారు కళ్యణమ్ మొదలు పెడతారు ....
"సీత రాములు ఇద్దరూ పట్టు బట్టల్లో మెరిసిపోతున్నారు.
మండపం నిండుగా జనం ఉన్నా అంతా నిశ్శబ్దంగా ఉంది.
అందరూ భక్తి శ్రద్ధలతో చూస్తున్నారు.
పంతులుగారికి కూడా ఉత్సాహం వచ్చినట్టు ఉంది.
మంత్రాలకి అర్ధం చెబుతూ, జరుగుతున్న తంతు ఎందుకో వివరిస్తూ చాలా ఓపికగా జరిపించారు.
పాదుకలని ఇత్తడి పళ్ళెంలో పెట్టి నీళ్ళతో కడిగారు..
కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అన్నమాట.
ఆ తర్వాత జీలకర్ర-బెల్లం.
పంతులు గారు, మా పూజారి గారు సీత రాముల తలలపై వాటిని ఉంచారు.
వధూవరుల తాత , తండ్రుల వివరాలు, వారి గోత్రాలు, ఋషులు అన్నీ ప్రవర రూపంలో చదివారు. '
చదువుతుంటే వినడానికి భలే ముచ్చటగా అనిపించింది.
తలంబ్రాలు పోస్తుంటే వీరణాల వాళ్ళు, బ్యాండు వాళ్ళు పోటీ పడ్డారు.
మరో పక్క బాణాసంచా.
తరవాత చదివింపుల కార్యక్రమం .. "
అక్కడితో కళ్యాణం ముగిసింది ..
తలంబ్రాల బియ్యం కోసం భక్తులు పోటీ పడ్డారు..
ఈలోపు గుడి పక్కన సావిడి లో పానకాల రెడీ ఐపోయేవి ..
కళ్యణమ్ రోజు రాముడు గారిది వైశాఖ పూజ ..
పచ్చి శనగలు దేవుడికి .. ఉడికించిన శనగలు భక్తులకు ..
తొమిది రోజులు వైశాఖ పూజలు ఉంటాయి ..
రోజు పానకాల .. ప్రసాదాలు .. పల్లకి ఊరేగింపు
ఐదవ రోజు చక్ర స్థానం .
మా చిన్నపుడు ఐతే వైశాఖ పూజలకి తాటాకు విసిన కర్రలు ఇచ్చేవారు
తరువాత ప్లాస్టిక్ విసిన కర్రలు
ఇప్పుడు ఏమి ఇవ్వటం లేదు అందరి ఇల్లల్లో ఇన్వెర్టర్ ఉన్నాయి ..
కానీ కొన్ని పద్ధతులు ఏమి మారలేదు ఇత్తడి పల్లకి .. కర్పూర హారతి ..
మా గోదారి రాముడి ... సీత రాముడు .. మా అగ్రహారం రాముడు .. లోకాభి రాముడు .
సర్వేజనా సుఖినోభవంతు


Happy Srirama Navami
రిప్లయితొలగించండికళ్ళకు కట్టినట్టు చెప్పావు
రిప్లయితొలగించండికళ్ళకు కట్టినట్టు చెప్పావు
రిప్లయితొలగించండికళ్ళకు కట్టినట్టు చెప్పావు
రిప్లయితొలగించండి