సంస్కృతి .....సంప్రదాయం|| కథలు ......కవితలు|| విలాపము..... వినోదము|| పాటలు .. పద్యాలు ||
20, డిసెంబర్ 2020, ఆదివారం
తీర్థం పోదామా తిమ్మప్ప
16, డిసెంబర్ 2020, బుధవారం
అరుగు విలాపం
14, డిసెంబర్ 2020, సోమవారం
ఓ(తేగ లో)చందమామ ఎంత పని చేసావు
తేగ తెచ్చిన తంట
మా ఊరిలో పొలంలో తేగలపాతర వేసేవారు .
అంటే తాటి టెంక లన్నీ ఒక చోట పాతిపెడతారన్నమాట .
అవి అన్నీ ఊరి తేగలు తయారయ్యాక తంపట వేస్తారు .అంటే ఒక కుండలో తేగలు వేసి చుట్టూ మంట వేస్తే లోపలి తేగలు చక్కగా ఉడుకుతాయన్నమాట .
వాటిలో లావుపాటి తేగలు పోటీపడి ఏరుకొని తినేవాళ్ళం దానికి తోడు కురిడి కొబ్బరి ముక్క
వాటి రుచి చెప్పక్కర్లేదనుకోండి .
తేగని రెండుగా చీలిస్తే మధ్యలో చందమామని తినొద్దని ,తింటే చదువు రాదనీ చెప్పేవాళ్ళు .
మేం భయపడి తినేవాళ్ళం కాదు .కాని అప్పుడప్పుడు అమ్మ చూడకుండా తిన్న నాకు చదువు కోచం బాగానే అబింది
ఇంతకూ నాకొచ్చిన తంటా ఏవిటంటారా ? అక్కడికే వస్తున్నా !ఈ రోజు మా పాప కి తేగలు పెట్టా .పెట్టి ఊరుకోకుండా చందమామ తినకూడదు అన్నా .అంతే మొదలైంది నాకు తంటా ...ఎందుకు తినకూడదు ? ఎందుకు చదువు రాదు ? నీకెవరు చెప్పారు ? అంటూ వదలకుండా వెంట పడింది .మా రోజులు కావు కదా పెద్దాళ్ళు చెప్పారు కదాని వినటానికి .పిల్లల దగ్గర నోరు జారితే ప్రతీదానికి రీజన్ చెప్పాల్సి వస్తోంది .ఒక పట్టాన వదలరు నాకు తెలీదని అంటే మరెందుకు చెప్పావ్ అంటూ అందర్లో పరువు తీస్తారు.
సరే ఇక తప్పదు అనుకొని నా మేదో ళక్తి పదును పెట్టి కథ మొదలు పెట్టాను
అనగనగా చాలా సంవత్సరాల క్రితం అంటే కొన్ని వందల ఏళ్ల క్రిందట రాసుకోవడానికి పుస్తకాలు ,పేపర్లు ....ఉండేవి కాదు .అప్పుడు తాటి ఆకుల్ని కోసి వాటిపైనే రాసుకోనేవారు .వాటినే తాళపత్ర గ్రంధాలంటారు . అంటే మన పుస్తకం లాగే తాటి ఆకులు కూడా సరస్వతీ దేవి అన్నా మాట .మరి చందమామ మొలిస్తే తాటి చెట్టవుతుంది కదా .అందుకే చందమామ తింటే సరస్వతీ దేవికి కోపం వస్తుంది .చదువు రాదు అందుకే తినొద్దని అంటారన్న మాట .అని చెప్పి ఉపిరి పీల్చుకున్నా.
మాపాప కన్విన్స్ అయ్యింది అని అనిపించింది ...అప్పటి వరకు ఊపిరి బిగబట్టి వింటున్న మా ఆయన .....ఇలా అంతా హాశ్చర్యంగా చూసి నిజమా ...నాకింతవరకు తెలీదు .....
చిన్నప్పుడు నాకెప్పుడూ చెప్పలేదే ...అంటూ .....ఒకటే ప్రశ్నలు .ఏం చెప్పను నా ఇబ్బంది ?ఇంతలో మా పాప అడిగింది ..నువ్వు చెప్పింది కరక్టే కాని ఇప్పుడు మేం బుక్స్ మీదే రాస్తున్నాంగా ...మేమెందుకు తినకూడదు ? అని .
హా ..........హతవిధీ ......
ఇంతకూ చందమామెందుకు తినకూడదంటారూ? మీకేమైనా తెలుసా ?
లోక సమస్త సుఖినో భవంతు
*********** మీ ఉషగిరిధర్ ***********
నంది లేని శివాలయం .. నందంపూడి
13, డిసెంబర్ 2020, ఆదివారం
శరణు.... శరణు....శ్రీనివాస
8, డిసెంబర్ 2020, మంగళవారం
శరణు......శరణు.....శంకరా
లోక సమస్త సుఖినో భవంతు
**** మీ ఉషగిరిధర్ ***********
6, డిసెంబర్ 2020, ఆదివారం
కరోనా ఇయర్స్ ...👂👂
ఒకప్పుడు ఏనుగు చెవులు(ఇయర్స్)ఉంటే అదృష్టవంతులు అనేవాళ్ళు....
ఈ కరోనా ఇయర్స్ అయ్యాక అందరూ అదృష్టవంతులే అయిపోతారు....
మాస్కులు పెట్టుకొని పెట్టుకుని ఏనుగు చెవుల వచ్చేసి మరి...
ఏవంటారు నిజమే కదా 😛😛😛
***మీ ఉషగిరిధర్***

