పోదున్నే లేవగానే మీద బల్లి పడింది
బల్లి శకునం పుస్తకం తిప్పుతుంటే ......... అక్కడ బల్లి బాష కూడా కనిపిస్తోంది
సీన్ కట్ చేస్తే.....
మీద పడ్డ బల్లి కుడా కంగారు కంగారు గా తమ బల్లి పెద్ద దగ్గరికి వెళ్లి
"పోదున్నే మనిషి మీద పడ్డ నాకేమవుతోంది అని అంటోంది
(పొద్దునే బల్లి బాష చదివా కాబట్టీ వాటి మాటలు అర్ధం అవుతున్నై ... )
బల్లి :ఇప్పుడు ఏమవుతుంది నాకు చాలా భయం గా ఉంది
బల్లి పెద్ద : నువ్వు ఎవరు మీద పడ్డావ్ .. ... .
పుస్తకం లోకి చూస్తూ ....
వాడు
రాజకీయ నాయకుడు ఐతే నువ్వు "నీ మీద రెండు పత్రికలలో మంచి కవేరేజి వస్తుంది ...""
సినిమా హీరో ఐతే " సినిమా సైట్ ల నిండా నీ ఫోటోలు పడతాయి "
బల్లి పెద్ద : ఇంతకీ నువ్వు పడింది ఎవరి మీద ?
బల్లి: తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ !! ఇప్పుడు నా పరిస్తితి ఏంటండి అంది బయపడుతూ ..
బల్లి పెద్ద : ముసి ముసి నవ్వులు నవ్వుతూ ...
ఐతే ఈ పాటికి నువ్వే ఏ తెలుగు బ్లాగ్ లో అచ్చు ఐపోతావ్ అంది !!
బల్లి పిల్లా, కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ బ్లాగుకి అనర్హం
రిప్లయితొలగించండి