ఫోను కష్టాలు...........
ఇది అష్టకష్టాల జాబితాలో లేని కష్టం.
అష్టకష్టాల లెక్క రాసిన రోజుల్లో లేని కష్టం.
ఎందుకంటే ఫోనున్న ప్రతి ఒక్కరికీ ఏదో సమయంలో ఎదురయ్యే సమస్యే ఇది.
రెండు వారాల క్రితం నా సెల్ ఫోన్ పాడయింది.
నిజానికి ఇది చాలా ఆనందంగా ప్రకటించాల్సిన విషయం.
వాడుతున్న ఫోన్ పనిచేయకపోవడం తో కొత్త ఫోన్ కొనాల్సిన సందర్భం రానే వచ్చింది.
అప్పటికే ఓ నిర్ణయం తీసేసుకోవడంతో ఓ 'పెద్ద' పేరున్న షాపుకెళ్ళి కాసేపు రకరకాల సెట్లు చూసి ఒకటి ఎంపిక చేసేసుకున్నా.. ఫీచర్ల గురించి సేల్స్ వాళ్ళని కాసేపు విసిగించి బిల్లు కట్టేశాను.
సరే.. కొన్నాళ్ళు బాగానే గడిచింది. నెమ్మదిగా ఫోన్ మెమరీ లో డాటా పెరుగుతోంది.
మెమరీ పుణ్యమా అని ఓ పుస్తకంలో ఫోన్ నంబర్లు రాసుకునే అలవాటు కూడా మానేశా.
డాటాని బ్యాకప్ తీసుకునే పనిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను.
ఎప్పుడో కొంప మునుగుతుందని నా సిక్స్త్ సెన్స్ పాపం అప్పుడప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది. 'ఇదెంత..పది నిమిషాల పని..' అని ఎప్పటికప్పుడు దాని నోరు నొక్కేశాను.
నంబర్లన్నీ పోవడం మరో సమస్య. ఇదివరకేవరైనా 'మీ నెంబర్ మిస్ ఐంది.. ఫోన్ మార్చాను..' అంటే అప నమ్మకంగా చూసేదానిని . నిజంగా మీకు ఆసక్తి ఉంటే అలా పోగొట్టుకుంటారా? అన్నట్టు. ఇప్పుడు అదే వివరణ నేను ఇవ్వాల్సి రావడం, అందరూ నా గురించి అలాగే అనుకుంటున్నారేమో అని సదేహం. ఇదో రకం కష్టం. ఇలా కథ సాగుతుండగా ఇవాల్టి ఉదయం ఫోన్ రిపేరు షాపు వాళ్ళు సంక్షిప్త సందేశం పంపారు. రిపేర్ పూర్తయ్యింది, వచ్చి ఫోన్ తీసుకెళ్ళమని. ఫోన్ తీసుకోగానే చేసిన మొదటి పని. ఫ్రెండు ఫోన్ తిరిగి అప్పచెప్పడం. ఫోన్ భద్రంగా ఇచ్చేస్తున్నానన్న ఆనందంలో పువ్వుల్లో పెట్టి ఇవ్వడం మర్చిపోయాను.
ఫోన్ మెమరీ లో ఒక్క నంబరూ, ఒక్క మెసేజీ లేక పోయినా నా ఫోను నాకు వచ్చేసిందన్న సంతోషం మిగిలింది. ....................
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి